Dr K Laxman: భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం పని చేయడమే మోడీ లక్ష్యమని ఎంపీ రాజ్యసభ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని కీస్ హై స్కూల్ లో తమిళ తులువా వెళ్లాల (ముదాలియర్) కమ్యూనిటీ వారు నిర్వహించిన తమిళ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్
Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆదివారం బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, పౌరసత్వ సవరణ చట్టం CAAను రద్దు చేస్తామని పి.చిదంబరం అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఆయన పేర్కొన్నారు.
Kishan Reddy: మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూసుఫ్ గూడ కృష్ణానగర్ లో జైన్ మందిర్ ను సందర్శించారు. అనంతరం మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి ఎన్నికలు కాదు... రెండు పరివార్ ల మధ్య జరిగే యుద్ధం.. ఈవీఎం, ఈడీ, ఇన్ కం ట్యాక్స్, సీబీఐ, ఆదానీ, అంబానీ అంతా మోదీ పరివార్ అని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ మిత్ర పక్షాలైన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. ఈ మేరకు శనివారం డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క సీపీఐ కార్యాలయాని వెళ్లారు. ఆయన కార్యాలయానికి రావడం సంతోషదాయకమని సీపీఎం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని భట్టీ కోరినట్లు వెల్లడించారు.
బీజేపీ లోక్సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ (72) హఠాన్మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆగస్ట్ లో రైతు రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ బోగస్ మాటలు చెబుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. జూన్ లో రుణమాఫీ చేయాలని 5700కోట్ల రూపాయలు లేని ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను తిరిగి మోసం చేయాలని చూస్తోందన్నారు.
రేవంత్ రెడ్డికి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని.. అన్ని అబద్ధాలే మాట్లాడారని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక లో ఏ రంగుతో పోటీ చేశానో, మెదక్ లో అదే రంగు తో పోటీ చేస్తున్ననని.. కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో గెలవలేదా.?
Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నయన్నారు.