ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని విజేందర్ సింగ్ తెలిపారు. దీన్ని అంగీకరించడానికి తనకు ఎటువంటి సంకోచం లేదని.. ఇందుకు తన దగ్గర కారణాలూ ఉన్నాయన్నారు. బీజేపీలో చేరిక తర్వాత తొలిసారి ఆయన స్పందించారు. కాషాయ పార్టీలో చేరాక.. కాంగ్రెస్‌లో కొందరు ఆప్తమిత్రులకు దూరమైయినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Congress: ప్రధాని మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
తాను కేవలం వేదికను మార్చాను తప్ప తాను మాత్రం మారలేదన్నారు. ఎప్పటిలాగే ఉన్నా. బాక్సింగ్‌లో వెయిట్ కేటగిరీ మార్చినప్పుడు కలిగే ఇబ్బంది మాదిరిగానే.. రాజకీయాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని తెలిపారు. సర్దుకుపోవడం కష్టంగా అనిపించి వేదికను మార్చుకున్నా.. యువత శ్రేయస్సు, దేశం కోసం బీజేపీలో చేరినట్లు తెలిపారు. తన నిర్ణయం కొందరికి షాక్‌కు గురిచేసిందన్నారు. పంజాబ్, హర్యానా, యూపీలో తన సన్నిహితులు కలత చెందినట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఆప్త మిత్రులకు కూడా దూరమైనట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో భావోద్వేగం సహజంగానే ఉంటుందని… మళ్లీ వాళ్లకు దగ్గరవుతాననే విశ్వాసం తనకు ఉందని విజేందర్ సింగ్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Anant-Radhika wedding: అనంత్-రాధిక పెళ్లి కబురు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!
సార్వత్రిక ఎన్నికల ముందు విజేందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి హస్తం అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ నేత రమేశ్ బిధూరీ చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది అప్పటి భారత రెజ్లింగ్ సమాఖ్య బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు విజేందర్ మద్దతిచ్చారు. వారితో పాటు ఆందోళనలోను పాల్గొన్నారు. అనంతరం బీజేపీ గూటికి చేరడం సన్నిహితులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: Chandrababu: ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్