AAP: ఢిల్లీ లిక్కర్ కేసు, స్వాతి మలివాల్పై దాడి కేసుల్లో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో షాక్ తగిలింది. ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసింది.
2024 లోక్సభ ఎన్నికల చివరి దశకు ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది.
ఏడో దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ.. గత 24 ఏళ్లుగా విపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా.. ఈ వ్యక్తులు (ప్రతిపక్షాలు) దుర్వినియోగం చేసేందుకే ఇష్టపడుతారని విమర్శించారు.
నేడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్నగర్ తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్పూర్లో జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం..విద్యుత్ ని తెచ్చింది నెహ్రు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. FCI ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రు అని, మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్.. ఆస్తులు ధారదత్తమ్ చేస్తుంది మోడీ అని ఆయన మండిపడ్డారు. 60 ఏండ్లు పాలించిన వాళ్ళు ఏం చేయనిదే.. బీజేపీ..brs వాళ్ళు…
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గత ఏడాది నవంబర్ 30న జనగాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను నామినేట్ చేయగా, బిజెపి జి…
ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని.. ఆరో దశలో 400 దాటిందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఆరోపించారు.
V. Hanumantha Rao: దేశంలో జూన్ 5తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ. V.హనుమంతరావు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినప్పుడు మన దేశంలో గుండు సూది కూడా తయారు కాలేదన్నారు.
Maheshwar Reddy: ఉత్తమ్ కుమార్ పై బీజెఎల్పీ నేత మహేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. నేను సంధించిన 19 ప్రశ్నల్లో ఒక్కదానికే మంత్రి ఉత్తమ్ సమాధానం ఇచ్చారన్నారు.