Elections Results 2024: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో 8360 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి భవితవ్యం ఈ రోజుతో తేలిపోనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈ సారి కూడా అధికారంలోకి వస్తుందని, 350కి పైగా సీట్ల సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి తామే అధికారంలోకి వస్తామని, ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని, తాము 295 సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ స్వయంగా 370కి పైగా స్థానాలను, ఎన్డీయే కూటమి 400+ స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎన్నికల ముందు నుంచి చెబుతోంది.
Read Also: Loksabha Elections : 20 ఏళ్ల తర్వాత రాయ్‌బరేలీకి కొత్త ఎంపీ.. రాహుల్, దినేష్ ప్రతాప్ మధ్య గట్టి పోటీ
కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన అరగంట తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్‌లో 5 దశల్లో పోలింగ్ జరగగా, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరిగింది. కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఛత్తీస్‌గఢ్, అస్సాంలో 3 దశల్లో, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో 4 దశల్లో పోలింగ్ జరిగింది. ఆరు జాతీయ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా 744 పార్టీల నుంచి 8360 మంది అభ్యర్థులు 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేశారు.