INDIA bloc: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు..? ప్రధాని మోడీ గెలుస్తారా..? ఇండియా కూటమి సత్తా చాటుతుందా..? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంంది. అయితే, ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని, ప్రధాని మోడీ మూడో సారి అధికారంలోకి వస్తారని చెప్పాయి. అయితే, ఇండియా కూటమి తాము 295+ స్థానాలు గెలుస్తామని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతాయని ధీమా వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే, ఫలితాలు వెలువడే ఈ రోజు ఇండియా కూటమి నేతలు ఢిల్లీకి రాబోతునున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వ్యూహాలను చర్చించడానికి సమావేశం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జూన్ 1న ఎన్నికల ముగిసన తర్వాత కూటమి నేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. మంగళవారం(ఈ రోజు) సాయంత్రం లేదా బుధవారం ఉదయం కూటమి నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
Read Also: BJP: బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా.. 1984 కాంగ్రెస్ రికార్డును పునరావృతం చేస్తుందా..?
జూన్ 1న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మరియు కెసి వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేశాయ్, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, చంపాయ్ సోరెన్, కల్పనా సోరెన్, టి ఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా, డి రాజా, దీపాంకరిత్ భట్టాచార్య మరియు దీపాంకరిత్ భట్టాచార్య, సమావేశానికి హాజరయ్యారు.
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. జూన్ 1 సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. తాము 543 స్థానాలకు గానూ 295+ స్థానాలు సాధిస్తామని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.