ప్రపంచ మీడియా ఇప్పుడు ఇండియాపై ఫోకస్ పెట్టింది. నెక్ట్స్ వచ్చే గవర్నమెంట్ ఎవరిదంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అంతేకాకుండా రకరకాలైన కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం మరికొన్ని గంటల్లోనే వెలువడనున్నాయి. ఇప్పుడు దేశ మీడియాతో పాటు ప్రపంచ మీడియా జూన్ 4ను చాలా ప్రత్యేకమైన రోజుగా చూస్తోంది. ప్రత్యేక కథనాలు.. స్పెషల్ ఫోకస్‌లతో ప్రసారాలు సాగుతున్నాయి. ఇంకోవైపు జోరుగా బెట్టింగ్‌లు కూడా సాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Tulsi Plant Benefits : తులసి మెుక్క పెంచుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సాధారణంగా ఇక్కడి వ్యవహారాలపై అంత ప్రాధాన్యమివ్వని పాశ్చాత్య మీడియా.. తాజా ఎన్నికలకు మాత్రం భారీ స్థాయిలో కవరేజీ ఇస్తోంది. ఇండో-పసిఫిక్‌లో ఢిల్లీ కీలకం కావడం, ప్రపంచ ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతుండటం, అంతర్జాతీయ వేదికలపై తన వాదనలు భారత్ బలంగా వినిపించడం వంటివి ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఎన్నికల కసరత్తు మొదలు.. ప్రధాన పార్టీల ప్రచారాల తీరు, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ సీఎన్‌ఎన్ మొదలు బీబీసీ, ఫ్రాన్స్24, అల్‌జజీరా, గ్లోబల్ టైమ్స్ వంటి అగ్రశ్రేణి మీడియా సంస్థలు పోటాపోటీగా విస్తృత స్థాయిలో కథనాలు ప్రచురించాయి. తుది ఫలితాల కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ఇది కూడా చదవండి: India bloc: ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఇండియా కూటమి నేతలు సమావేశం..
లోక్‌సభ ఎన్నికలు భారత్‌కే కాకుండా ప్రపంచానికీ కీలకమని ‘బీబీసీ’ తన కథనాల్లో పలు మార్లు పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుగా ఉన్న భారత్‌తో కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నట్లు పేర్కొంది. అరెస్టులు, ఆరోపణలు, కృత్రిమ మేధ ప్రభావాలు, ప్రచారం తీరుపై బ్రిటిష్ మీడియా అనేక కథనాలు ఇచ్చింది.
భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు కొనసాగిన సమయంలో అంతర్జాతీయ మీడియా దృష్టి మొత్తం భారత్‌పైనా కొనసాగించింది. మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితాల కోసం దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.