దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో చూసిన లోక్‌సభ ఎన్నికలు-2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
Exit Polls Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
సార్వత్రిక ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు విడతల పోలింగ్, కౌంటింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై చర్చించారు.
నూతన తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ శాసన సభాపక్ష నేత కూనమనేని సాంబశివరావు వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమా..? పేద రాష్ట్రమా అనేది అర్థం కావటం లేదన్నారు. తెలంగాణలో ఏ రంగం కూడా సంతృప్తిగా లేదన్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిందితుడుగా ఉన్నారు. మార్చిలో ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయగా, 50 రోజులు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు.
ఈ నెల 4 వ తేదీన వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆందోళన అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. దేశ ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీ వైపే ఉన్నారని చెప్పారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా.. గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు ఓల్డ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ (బాలికలు) బూత్ నంబర్ 223లో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకుని తన ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన తన బూత్‌లో తొలి ఓటు వేశారు. అంతకు ముందు.. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2023 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన బూత్‌లో మొదటి…