హర్యానాలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా గవర్నర్ బండారుదుత్త త్రేయకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం మెమోరాండం సమర్పించింది.
మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని..మెదక్ పార్లమెంట్ లో ఆరడుగులు ఉన్నోడు, గద్ద ముక్కోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
లోక్సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదిర్చే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించారు. మంగళవారం లోక్సభ స్పీకర్ పదవికి అభ్యర్థికి సంబంధించి రక్షణ మంత్రి ఇంట్లో బీజేపీ, మిత్రపక్షాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స్పీకర్ పదవిపై చర్చ జరిగింది.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతుంది. బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 7 పదునైన ప్రశ్నలు సంధించారు. భారతీయ రైల్వేల నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. బెంగాల్ లో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మల్లికార్జున్ ఖర్గే ఎక్స్లో స్పందిస్తూ.. 'రైల్వే ప్రమాదం జరిగినప్పుడల్లా,…
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో గవర్నర్ పదవీకాలం ముగియనుంది. ఉత్తరప్రదేశ్లో ఆనందీ బెన్ పటేల్, రాజస్థాన్లో కల్రాజ్ మిశ్రా, గుజరాత్లో ఆచార్య దేవవ్రత్, కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గవర్నర్ల పదవీకాలం మరో రెండు మూడు నెలల్లో ముగియనుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు తదుపరి గవర్నర్ ఎవరు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ బన్వారీ లాల్ పురోహిత్ ఇప్పటికే తమ పదవికి రాజీనామా చేశారు.. అయితే వారి…
Prof. Kodandaram: పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చీకట్లు అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలను నష్టం చేశారన్నారు.