Eknath Shinde: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి కోసం టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీహార్ మోడల్‌లో సీఎంను నిర్ణయించాలని ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిమాండ్ చేస్తుంది. బీహార్‌లో తక్కువ సీట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేసిందని పేర్కొంది. అయితే, బీజేపీ సంకీర్ణాన్ని అనుసరిస్తుందని.. ఎవరి నాయకత్వంలో ఎన్నికల్లో విజయం సాధించారో వారికి మాత్రమే మరో అవకాశం ఇస్తారని మహారాష్ట్రలో కూడా ఇదే ఉదాహరణ చెప్పుకొచ్చింది.. అలాగే, ఏక్ నాథ్ షిండే వర్గం దీనికి హర్యానా ఎన్నికలను కూడా ఉదాహరణగా చెప్పింది. కాగా, 6 నెలల క్రితమే సీఎం అయిన నాయబ్ సింగ్ సైనీ నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి.. బీజేపీ గెలవగానే మళ్లీ అవకాశం వచ్చిందని షిండే సేన వెల్లడించింది.
Read Also: Nellore News: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి!
ఇక, సీఎం పీఠంపై ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు మహా యుతి కూటమికి చెందిన అగ్రనేతలు- దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ఈరోజు (సోమవారం) ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు పాల్గొంటారని సమాచారం. ఈ చర్చల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.