కేటీఆర్ విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తోందని ఆరోపించారు. లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు.
తిరుపతి ఘటన బాధాకరమని మంత్రి సవిత అన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆమె మాట్లాడుతూ.. "తిరుపతి ఘటనలో కుట్రపూరితంగా చేశారని అంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కావాలని చేశారని అంటున్నారు. క్లారిటీ వచ్చాక ఈ విషయాలపై మాట్లాడతాం. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు.
IT Raids: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో అధికారులకు షాక్ తగిగిలింది. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఆ ఇంట్లో మూడు మొసళ్లను కూడా వారు గుర్తించారు.
రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందన్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి వారిని…
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అనంతపురం రేంజ్ డీఐజీ తెలిపారు. 2500 మంది సిబ్బందితో పది రోజులు పాటు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మొన్న జరిగిన ఘటన పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఉహించనిదన్నారు. భక్తుల భద్రతపై పూర్తి భరోసా పోలీసు శాఖ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై భక్తులు వద్ద ఏమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని..…
తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలపై తీవ్రమైన దృష్టి పెట్టింది. పార్టీని బలోపేతం చేసేందుకు మండల అధ్యక్షులను ప్రకటించింది. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాష్ర్ట పార్టీ అప్రూవల్ తీసుకొని బీజేపీ మండల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది.
Kangana Ranaut: తొలి నుంచి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. ఇక, తన సినిమాను వీక్షించేందుకు రాహుల్‌ను ఆహ్వానించేందుకు వెళ్లగా.. ఆయన అంత మర్యాదగా వ్యవహరించలేదని ఆమె తెలిపింది.
ఏపీలో ఎక్కడా లేని ఉత్సాహం విశాఖలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. విశాఖలో మోడీ రోడ్ షో అదిరిందన్నారు. ఎ
ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేము అండగా ఉంటామని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు.
భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోడీ ఏకతాటిపై నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని.. అందుకే ప్రజలు భారీ మెజార్టీ అందించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి మోడీ ఎంతగానో సహకరిస్తున్నారని… ఇందులో భాగంగానే ఈరోజు ఏపీకి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి…