ఈ నెల 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు విధించారు పోలీసులు.. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో…
చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్యం 13 లక్షలు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.. ఒక్కోక్కరి తలపై 2 లక్షల రూపాయల అప్పు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో డీసీసీబి బ్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై హాట్ కామెంట్ చేశారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలనే షర్మిలమ్మ మాట్లాడుతుందని…