ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అధ్యక్షుడు పదవి అడుగుతానని.. కానీ ఇస్తరా లేదా వాళ్ళ ఇష్టమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 1995 నుంచి హిందూ వాహినిలో కార్యకర్తగా పని చేసినట్లు చెప్పారు.
బాబూమోహన్. మాజీ మంత్రి. గతంలో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారు కూడా. గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిపోయారు. ఈ దఫా ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నారు బాబూమోహన్. నియోజకవర్గంపై పట్టు ఉండటంతో తప్పకుండా తనకే బీజేపీ సీటు ఇస్తుందని లెక్కలేసుకుంటున్నారు. అయితే ఆందోల్ బీజేపీలో పరిస్థితులు మరోలా ఉన్నాయట. అక్కడ జడ్పీ మాజీ ఛైర్మన్ బాలయ్య నుంచి గట్టి పోటీ ఉందట బాబూమోహన్‌కు. దీంతో…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బీజేపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలకు చెందిన నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ రోడ్డున పడటం చర్చగా మారింది. గోపన్‌పల్లి రహదారిపై ఘర్షణకు దిగడంతో పార్టీలోని అంతర్గత విభేదాలు అందరికీ తెలిసిపోయింది. అసెంబ్లీ బీజేపీ ఇంఛార్జ్ గజ్జెల యోగానంద్‌తో సహా పలువురు నాయకులు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డితో జరిగిన వాగ్వాదం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గం బీజేపీలో మూడు గ్రూపులు…
తెలంగాణలో మరింత విస్తరించాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఢిల్లీ నాయకత్వం పదే పదే రాష్ట్ర నాయకులకు చెబుతూ వస్తోంది. ప్రజా సమస్యలు.. రాజకీయ అంశాలపై అటెన్షన్ తీసుకొస్తూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరగడానికి వివిధ పార్టీల్లో శక్తికేంద్రాలుగా ఉన్న నాయకులకు కాషాయ కండువా కప్పాలని స్పష్టంగా సూచిస్తున్నారు. దాంతో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. కానీ.. ఆ స్థాయిలో జాయినింగ్స్ లేవు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత వలసలు…
* విశాఖ రానున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. రేపు సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం సత్యనారాయణ * నేటి నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం *నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం *నేడు టీడీపీ నేత నారా లోకేష్ కర్నూలు పర్యటన. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత రాజవర్ధన్ రెడ్డి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్న…
నిజామాబాద్ కమలంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు, మూడు వర్గాలుగా నాయకులు.. కార్యకర్తలు విడిపోయారు. ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు ముదురుపాకాన పడుతున్నాయి కూడా. ఇందుకు హనుమాన్ శోభాయాత్రలో జరిగిన గొడవలే తీవ్రతను తెలియజేస్తున్నాయి. బీజేపీలో గొడవలు సమసి అంతా గాడిన పడుతున్నారని అనుకుంటున్న తరుణంలో ముఖ్య నాయకులే రోడ్డెక్కి చొక్కాలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీకి కాస్త పట్టుందని భావిస్తున్న అర్బన్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ…
కరీంనగర్ జిల్లా బీజేపీలో ఇంకా ముసలం తొలిగిపోలేదా? వేములవాడలో కొత్త ఎత్తుగడలు మొదలయ్యాయా? బీజేపీలో అంతర్గతపోరు తీవ్రస్థాయికి చేరుకుందా? బండి సంజయ్‌ను వదల బొమ్మాళి అని వెంటాడుతోంది ఎవరు? ఉనికి కాపాడుకొనే పనిలో అసమ్మతి వాదులుకరీంనగర్ జిల్లా బీజేపీలో కొంతకాలంగా బండి సంజయ్, పార్టీలో సీనియర్లుగా చెప్పుకొంటున్నవారి మధ్య వార్ కొనసాగుతోంది. సంజయ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలను పార్టీ పెద్దలు సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసమ్మతి వాదులపై యాక్షన్ వద్దనుకున్నారో ఏమో.. అటు…