Babu Mohan: బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్ బూతుపురాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babu Mohan Audio Recording With Party Leader Going Viral: ఓ బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి బాబుమోహన్ బూతుపురాణం సంధించారు. మీతో కలిసి పని చేస్తానని చెప్పిన పాపానికి.. నువ్వెంత? నీ బతుకెంత? అంటూ బూతులు తిట్టారు. తానో ప్రపంచస్థాయి నాయకుడినని, ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు కూడా! చివరికి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని సైతం విడిచిపెట్టలేదు. కావాలంటే తాను బీజేపీకి రాజీనామా కూడా చేస్తానన్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hyderabad Crime: రౌడీషీటర్ దారుణ హత్య.. కారణం అదేనా?
Also Read
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆందోల్‌కి చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ తొలుత బాబుమోహన్‌కి కాల్ చేశారు. ‘చెప్పు తమ్ముడు’ అంటూ తొలుత ఇద్దరి మధ్య సంభాషణ సజావుగానే సాగింది. కానీ, మీతో కలిసి పని చేయడం కోసం ఫోన్ చేశానని ఆ కార్యకర్త చెప్పాక.. బాబుమోహన్ బూతుపురాణం అందుకున్నారు. నువ్వెంత? నీ బతుకెంత? అంటూ ధ్వజమెత్తిన ఆయన.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసేందుకు అమిత్ షా తనను బీజేపీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. తాను ఒక ప్రపంచస్థాయి నాయకుడినని ఆ కార్యకర్తపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన బండి సంజయ్‌ని కూడా వదల్లేదు. ఆ కార్యకర్త బండి సంజయ్ పేరు ప్రస్తావించగా.. ‘బండి సంజయ్ ఎవడ్రా, వాడు నా తమ్ముడు’ అని బదులిచ్చారు. ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే.. జోగిపేటలో చెప్పు తీసుకొని కొడతానని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే రేపే బీజేపీకి తాను రాజీనామా చేస్తానన్నారు.
Human Sacrifice in Chennai: కన్యాకుమారిలో ఘోరం.. చిన్నారి నరబలికి ప్రయత్నం
అటు.. ఓ కార్యకర్తకు ఇచ్చే మర్యాద ఇదేనా? తాను ఎంతోకాలం నుంచి బీజేపీలో ఉన్నానని, కార్యకర్తగా కష్టపడుతున్నానని వెంకటరమణ చెప్తున్నా.. బాబుమోహన్ వినిపించుకోకుండా ఫోన్ పెట్టేయ్ అంటూ అరిచారు. తాను ఎన్నో పనులు చేశానని, తాను పుట్టినప్పుడు నీ వయసెంత? అంటూ నిలదీశారు. జోగిపేటకు నువ్వేం చేయగలవు? నీకు ఎన్ని ఓట్లని ప్రశ్నించారు. తనకు 2 వేల ఓట్లు వచ్చాయని బదులివ్వగా.. నీ స్థాయి ఎంత అంటూ మండిపడ్డారు. నువ్వు నాతో మాట్లాడ్డానికి అనర్హుడివి, ఆ కార్యకర్తను చిన్న చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డింగ్ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!