BJP MLA: ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 48 సీట్లలో బీజేపీ గెలిచింది. ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. గత పదేళ్ల ఆప్ అధికారానికి బీజేపీ బ్రేకులు వేసింది. ఇదిలా ఉంటే, తాజాగా ముస్తఫాబాద్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ముస్తఫాబాద్ పేరుని ‘‘శివపురి’’ లేదా ‘‘శివ విహార్’’గా మారుస్తామని ప్రకటించారు.
యూపీలోని బదౌన్‌లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ షాక్యా, అతని సోదరులు సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జాలకు పాల్పడినట్లు కేసు నమోదయ్యాయి. ప్రత్యేక కోర్టు, ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లీలు చౌదరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బిల్సీ ఎమ్మెల్యే, ముఠాపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సివిల్ లైన్స్ కొత్వాలి పోలీసులు, ప్రాసిక్యూషన్ కార్యాలయం నుంచి న్యాయ…
మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. దీనితో పాటు.. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయానికి రాజా సింగ్ చేరుకున్నారు. మహాకాళ్ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న మతపరమైన సంక్షోభాన్ని బాబా మహాకాళ్ ఆశీస్సులతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.
Yoges Varma: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికకు సంబంధించి వివాదం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే యోగేష్ వర్మపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవధేష్ సింగ్ చెంపదెబ్బ కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవధేష్‌ను చెప్పుతో కొట్టిన ఎమ్మెల్యే మద్దతుదారులు అవధేష్‌ను కూడా కొట్టారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బిజెపి లఖింపూర్ యూనిట్…
Delhi CM: నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీలు సిద్ధమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది.
Karnataka BJP: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Goa: మద్యపానం, బీచులకు గోవా ఫేమస్. ఈ రాష్ట్రానికి టూరిస్టు వెళ్లేందుకు మద్యం కూడా ఒక కారణం. ఇదిలా ఉంటే గోవాలో మద్యాన్ని నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే ప్రేమేంద్ర షెడ్ శాసనసభలో డిమాండ్ చేశారు. అయితే, సహచర బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయన డిమాండ్‌ని పెద్దగా పట్టించుకోలేదు.
India vs China: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో డ్రాగన్ కంట్రీ చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల వరదలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పలు నంబర్ల నుండి ఫోన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా.. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా.. బెదిరింపు కాల్స్ పై ఆయన స్పందించారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా…
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఓటు వేసే ముందు బురఖా ధరించిన మహిళలను గుర్తించాలని ఆయన కోరారు.