దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయం మీద మాట్లాడాలి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన విమర్శలు చేసే నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గతంలో పాలన ఎలా ఉండేదో గుర్తుకు ఎరిగి మాట్లాడితే మంచిదన్న ఆయన కేంద్రం నిధులు ఇస్తే పేర్లు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటుంది అని విమర్శలు చేస్తున్నారు. వాస్తవం తెలుసుకొని మాట్లాడితే ప్రజలు ఆ నాయకులకు గౌరవం దక్కుతుందని అన్నారు. కేంద్ర పథకాలు మేము కాపీ కొట్టడం లేదు .మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలనే కేంద్రం కాపీ కొట్టిందని అన్నారు. మన రైతు బంధు పథకం కాపీ కొట్టి మోడీ గారు దేశంలో అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంను కేంద్రం తుంగలో తొక్కిందని, అన్యాయంగా మన రాష్ట్రానికి చెందిన సీలేరు ప్రాజెక్టు, 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం కలిపిందని అన్నారు.
దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయం పైన మాట్లాడాలని ఆయన అన్నారు. ఇంకా కొందరు నేతలు అయితే కేసీఆర్ గారిని అగౌరవంగా, నీచంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.వారి వల్ల సభ్యసమాజం సిగ్గు పడుతుందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికారంలోకి రాలేని,అసలు రావడానికి అవకాశం లేని పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు మురిగినట్టేనని ఆయన అన్నారు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయి.ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వస్తాను అంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి ? రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగంగా మాట్లాడుతున్నాను అని కొందరు నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారని అది సరి కాదని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!