జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉండవెళ్లి మండలం మారమునుగాల దగ్గర బండి సంజయ్ పాదయాత్ర విరామ సమయంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పాదయాత్రలో ప్రజలు కష్టాలు చెప్పుకోవడానికి బీజేపీ పార్టీ వచ్చిందని సంతోషిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలోని యువకులు నిరుద్యోగ…