జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉండవెళ్లి మండలం మారమునుగాల దగ్గర బండి సంజయ్ పాదయాత్ర విరామ సమయంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పాదయాత్రలో ప్రజలు కష్టాలు చెప్పుకోవడానికి బీజేపీ పార్టీ వచ్చిందని సంతోషిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలోని యువకులు నిరుద్యోగ సమస్య కారణంగా.. పశువుల కన్నా అద్వాన్నంగా బతుకుతున్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు… ఆర్డీఎస్ కొరకు పాటు పడతామని చెప్పిన ఆ నాటి ఉద్యమకారుడు కేసీఆర్ ఇప్పడు ఏక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. ఈ నాటికి ఆర్డీఎస్ ను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. పాదయాత్రలో రైతు బంధు గురించి రైతులను అడిగితే.. ఉన్నోడికే రైతు బంధు అని చెపుతున్నారని ఆయన వెల్లడించారు. కొంతమంది ఓర్వలేక బీజేపీ యాత్రను తొండి యాత్ర అంటున్నారని, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు బీజేపీ పార్టీ గ్రామస్థాయిలోకి వెళ్తుందన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ పార్టీని తీరగనివ్వనియమని అన్న చోట కూడా బీజేపీ ప్రజల లోకి వెళ్తుందని ఆయన తెలిపారు. బండి సంజయ్ చేస్తున్న పాద యాత్రను ఓర్వలేక మా పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నారన్నారు. మీరు మా పై రాళ్లతో దాడి చేసిన మేము ప్రజా సమస్యల కొరకు రాళ్ల దాడి నైనా భరించి.. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మాట్లాడుతూ.. కేసీఆర్ నీ పదవిని నిన్ను అరచేతిలో పెట్టుకోవడానికే.. ఒక పెళ్లిలో ఉన్న నిన్ను హత్య ప్రయత్నం చేయించినట్లు డ్రామాలు ఆడి కేసులు పెట్టించాడన్నారు.
TSRTC : బంపర్ ఆఫర్.. షార్ట్‌ఫిల్మ్ తీయండి.. నగదు గెలుచుకొండి..