దేశ సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి వచ్చే ముప్పును ప్రభుత్వం తక్కువ మాత్రమే చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దానిని అంగీకరించడం లేదన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు రైతు బీమాను కూడా అందజేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పంట నష్టపరిహారంతోపాటు రైతు బీమా అందని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
School Girls Cleaning Toilets in Madhya pradesh: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో భోజనాన్ని వడ్డించడం వివాదాస్పదం అయింది. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు టాయిలెట్లను క్లీన్ చేయడం వివాదాస్పదం అయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ లోపాలు తరుచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఈ వివాదంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్ అంది.
విద్యుత్ రంగాన్ని ప్రవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తోందని ప్రశ్నించారు.
Govt Employees, School Teachers, Go On ‘Mass Casual Leave’ in Gujarat: గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాస్ లీవుల్లో విధులను బహిష్కరించారు. తమ డిమాండ్లను అంగీకరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ.. శనివారం వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాద్యాయులు సామూహికంగా సెలవులు తీసుకుని.. విధులకు గైర్హాజరు అయ్యారు. పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తగా వేలాది మంది ఉద్యోగులు, పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం ‘మాస్ క్యాజువల్ లీవ్’ నిరసనల్లో…
సెప్టెంబర్ 17పై తెలంగాణలో ఇప్పుడు రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి… కొందరు చరిత్రను అనుగుణంగా మాట్లాడితే.. మరొకరు చరిత్రను వక్రీకరిస్తూ తమకు అనుకూలంగా మార్చుకునేవాళ్లు ఉన్నారు.. తెలంగాణ సాయుధ పోరాటంతో అసలు సంబంధం లేనివాళ్లు కూడా.. దానిని ఐజాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంతకీ సెప్టెంబర్ 17న అసలేం జరిగింది.. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఏకమై పోరాటాలు చేసిన ఆ పోరాటం జరిగింది.. భూమి కోసం.. భుక్తి కోసం..…
సెప్టెంబర్ 17పై తెలంగాణలో రాజకీయం రంజుగా జరుగుతోంది. పార్టీలన్నీ వేడుకలను తలో పేరుతో నిర్వహిస్తున్నాయి… విలీనం అని ఒకరు.. విమోచనమని మరొకరు.. విద్రోహమని ఇంకొకరు.. ఇలా పలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.. పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు జరిపారు. తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ…
KTR blamed the center on the bulk drug park: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణకు మోదీ సర్కార్ మొండి చేయి చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మోదీ సర్కార్ మొండి చేయి చూపించిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న…
Minister Aswath Narayan sensational comments: కర్ణాటకలో వరసగా యువకుల హత్యలు ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. ఇటీవల బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ నెట్టారును దక్షిణ కన్నడ జిల్లా బెల్లారే ప్రాంతంలో కొంత మంది దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో ప్రభుత్వం ఒక్కసారిగా సీరియస్ అయింది.
Central Government Jobs in 8 years: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గడిచిన 8 ఏళ్లలో 7.22 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని వెల్లడించారు. 2014-2022 మధ్య ఈ రిక్రూట్మెంట్ జరిగినట్లు బుధవారం పార్లమెంట్ లో…