బాన్సువాడ బీజేపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇంటిపై బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడుతో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ. రాత్రి నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యులతో పాటు, డ్రైవర్‌పై దాడి చేసి భయాందోళన సృష్టించి ఎన్నికలలో గెలవాలని చూడడం పిరికిపందల చర్య అన్నారు. ఓటమి భరించలేక దాడులకు తెగబడుతున్న బీఆర్ఎస్ గుండాల్లారా మీ ఆటలు ఇక సాగవు…
DK Aruna: మహిళ బిల్లును కవిత కోసమే మోడీ పెడుతున్నట్టు మాట్లాడుతుందని ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేసులను తప్పు దోవ పట్టించేందుకు నాటకాలు ఆడకు అంటూ మండిపడ్డారు.
ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్ ప్రారంభిస్తారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు బీజేపీ నేత డీకే. అరుణ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ నిరసన దీక్షలో ఆమె పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే… ఎక్కడా ఒక్క చుక్క నీరు పారలేదని.. కేవలం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవెల్లికే నీటిని మళ్లించారని ఆరోపించారు. మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి కడతా అని.. 14 లక్షల ఎకరాలకు…
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని డీకే అరుణ అన్నారు. Also Read : హైదరాబాద్ కు ఈటల.. సిద్ధిపేటలో ఆగి ఏం చేశారంటే.. కేంద్ర ప్రభుత్వం…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. రోజురోజుకు రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊరూరా ఈటల రాజేందర్ కు ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఈటల గెలుపు తథ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, హుజురాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల…
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌కి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘కృష్ణజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అడ్డుకునే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారు. 66 శాతం కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉండగా 535 టీఎంసీలు రావాల్సి ఉంది. 299 టీఎంసీల వాటాను మాత్రమే తీసుకోవడానికి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పంతాలు,…