ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్‌మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.