Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది.