కష్టాలన్నిట్లో అవమానం దారుణమైనది! పైగా అది లోలోన దాగుండి దహించేస్తుంటే మరింత నరకప్రాయంగా ఉంటుంది. అందుకే, ఆ హాలీవుడ్ నటుడు తనని ఇంత కాలం తీవ్ర మానసిక వేదనకి గురి చేసిన అంతర్మథనాన్ని ఇంతటితో అంతం చేద్దామనుకున్నాడు. 14 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న రహస్యం బయటపెట్టేశాడు. ప్రపంచం అవమానిస్తుందేమో అన్న భయం పక్కన పెట్టి తన ముందు తానైతే తల దించుకోకుండా ఉండాలని డిసైడ్ అయ్యాడు! అతనే బిల్లీ పోర్టర్…బిల్లీ పోర్టర్ ఓ అమెరికన్ నటుడు. ‘పోజ్’…