Rohini Acharya : బీహార్ రాజకీయాల్లో ఈరోజు చాలా కీలకం కానుంది. మరోసారి సీఎం నితీశ్ కుమార్ పార్టీ మారనున్నారు. ఈరోజు నితీష్ కుమార్ మహాకూటమిని వీడి ఎన్డీయేలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ-జేడీయూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ రాజకీయ గందరగోళం మధ్య వీధుల నుంచి సభ వరకు పోరాడతామని ఆర్జేడీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ ప్రకటించదు. ఇదిలా ఉంటే, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కూతురు రోహిణి మళ్లీ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు.
Read Also:Neru : ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ సూపర్ హిట్ మూవీ..
ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్‌పై విరుచుకుపడ్డారు. ‘చెత్త ఇప్పుడు మళ్లీ డబ్బాలోకి వచ్చింది’ అని అన్నారు. ‘చెత్త డస్ట్‌బిన్‌లోకి తిరిగి వెళుతుంది. ఆ గుంపంతా దుర్వాసనతో నిడిపోయింది’ అంటూ ట్విట్లర్లో పేర్కింది. నితీష్ కుమార్ రాజీనామా చేయడానికి ముందు.. రోహిణి ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “మా ఊపిరి ఉన్నంత వరకు, మతతత్వ శక్తులపై మా పోరాటం కొనసాగుతుంది…” అంటూ రాసుకొచ్చారు.
Read Also:Fake Passport Scam: నకిలీ పాస్ పోర్టు స్కామ్.. పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిఐడి
నితీష్ కుమార్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు బిజెపి మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. సీట్ల పంపకం తలెత్తిన చర్చలు విఫలమైన కారణంగా ఇండియా కూటమి నుంచి వైదొలిగారు.