బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల సమరం నడుస్తోంది. అంతేకాదు తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.. విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం
ఇదిలా ఉంటే గురువారం బహదూర్‌గంజ్‌లో ఎంఐఎం అభ్యర్థి తౌసిఫ్ ఆలం నామినేషన్ సందర్భంగా కార్యకర్తల కోసం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. నామినేషన్ తంతు పక్కన పెట్టి బిర్యానీ కోసం ఎంఐఎం మద్దతుదారులు, జనాలు కొట్టుకున్నారు. బిర్యానీ ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఒకరి మీద ఒకరు పడుకుంటూ ప్యాకెట్లు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Trump-Putin: 2 వారాల్లో పుతిన్ కలుస్తా.. ట్రంప్ వెల్లడి
తౌసిఫ్ ఆలం.. నామినేషన్‌కు ముందు నివాసంలో ప్రార్థన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తరలివచ్చిన ప్రజల కోసం బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. అయితే మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్యాకెట్లు కోసం కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. భారతీయుల దయనీయ స్థితి ఇంత దారుణంగా ఉందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అక్రమ వలసదారులు మాదిరిగా కొట్టుకుంటున్నారని.. వీరంతా భారతీయులులాగా లేనట్లున్నారే అని వ్యాఖ్యానించారు.
వీడియో వైరల్‌పై మజ్లిస్ పార్టీ స్పందించింది. హనుమాన్ చాలీసా తర్వాత ప్రసాదం పంపిణీ చేసినట్లే.. తాము కూడా మతచారం తర్వాత 2 వేల మందికి బిర్యానీ తయారు చేసినట్లు చెప్పుకొచ్చింది. జనసమూహం ఎక్కువగా రావడంతో తోపులాట జరిగినట్లుగా తెలిపింది.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం.. బి.ఫార్మ్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు
ఈశాన్య బీహార్‌లో ముస్లిం జనాభా 68 శాతం కంటే ఎక్కువ ఉన్న ఏకైక జిల్లా కిషన్‌గంజ్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఓడిపోయిన ఏకైక పార్లమెంటరీ స్థానం కూడా ఇదే. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇజహరుల్ హుస్సేన్ 61,078 ఓట్లతో ఈ స్థానాన్ని గెలుచుకోగా… బీజేపీ అభ్యర్థి స్వీటీ సింగ్ 59,697 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఎంఐఎం అభ్యర్థి కమ్రుల్ హోడా 41,904 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
బీహార్ రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
A scene at AIMIM candidate Tausif Alam’s nomination in Bahadurganj. AIMIM supporters brawling over free biryani. A telling snapshot. Indigence rules and politics still feeds off it!
SAD. pic.twitter.com/HmOLfSgdQv
— Rahul Shivshankar (@RShivshankar) October 17, 2025