Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయణిస్తోంది. మొత్తం 243 సీట్లలో 201 స్థానాల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 36 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసింది.
Bihar Election Results 2025 LIVE Updates: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది.. 38 జిల్లాల్లో, 243 అసెంబ్లీ స్థానాల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ఓట్ల లెక్కింపు కారణంగా బీహార్ లోని పాఠశాలలు, ఇతర విద్యాలయాలకు ఈరోజు సెలవు ప్రకటించారు.. కౌంటింగ్ కేంద్రాల్లో రెండంచల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఎన్డీఏ ముందుకు సాగుతోంది..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో నవంబర్ 11న పోలింగ్ జరుగనున్నది. రెండవ దశకు సంబంధించిన ఓటింగ్ నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండవ దశ ఓటింగ్‌లో NDA, మహా కూటమి రెండింటికీ చెందిన అనేక మంది ప్రముఖ నాయకుల భవిష్యత్తు తేలనుంది. ప్రచారం ముగియడంతో ఈ జిల్లాల్లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీ లేదా…
Asaduddin Owaisi: బీహార్ ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరు నేతలు ప్రచారాన్ని తీవ్రం చేశారు. తాజాగా, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్, ఓవైసీని ‘‘ఉగ్రవాది’’గా పిలవడం కొత్త వివాదానికి కారణమైంది. దీనిపై ఓవైసీ స్పందిస్తూ.. ‘‘బాబు ఉగ్రవాది(extremist)ని ఇంగ్లీషులో రాయగలరా..?’’ అంటూ సెటైర్లు వేశారు.
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఓట్ల కోసం ఏదైనా చేస్తారని ఆరోపించారు. ‘‘ మీ ఓట్ల కోసం నరేంద్రమోడీని డ్యాన్స్ చేయమని అడిగితే, అతను వేదికపైనే డ్యాన్స్ చేస్తారు’’ అని ముజఫర్‌పూర్ లో తేజస్వీ యాదవ్‌తో కలిసి ఉమ్మడి ర్యాలీలో రాహుల్ గాంధీ అన్నారు.
Story Board: మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ కూటమికీ పూర్తి సంతోషాన్నివ్వలేదు. సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం బీజేపీకి షాకిస్తే.. అనుకున్నట్టుగా ఫలితం రాకపోవడం కాంగ్రెస్‌నూ నిరాశపరిచింది. ఇలాంటి స్థితిలో ఆ తర్వాత జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. మోడీ మ్యాజిక్ తగ్గలేదని బీజేపీ సింహనాదం చేసింది. కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, ఓట్ల చోరీకి సాక్ష్యాలు చూపించడంతో.. కాంగ్రెస్ ఓ పద్ధతి ప్రకారం…