Bihar Election Results 2025 LIVE Updates: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది.. 38 జిల్లాల్లో, 243 అసెంబ్లీ స్థానాల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ఓట్ల లెక్కింపు కారణంగా బీహార్ లోని పాఠశాలలు, ఇతర విద్యాలయాలకు ఈరోజు సెలవు ప్రకటించారు.. కౌంటింగ్ కేంద్రాల్లో రెండంచల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఎన్డీఏ ముందుకు సాగుతోంది..
బీహార్‌లో ఎన్డీయే అఖండ విజయంపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఆయన బీహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేశారు. ‘‘బీహార్‌లో SIR ఆడే ఆట ఇకపై పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ లేదా ఇతర చోట్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ఎన్నికల కుట్ర ఇప్పుడు బహిర్గతమైంది’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
बिहार में जो खेल SIR ने किया है वो प. बंगाल, तमिलनाडू, यूपी और बाक़ी जगह पर अब नहीं हो पायेगा क्योंकि इस चुनावी साज़िश का अब भंडाफोड़ हो चुका है। अब आगे हम ये खेल, इनको नहीं खेलने देंगे।CCTV की तरह हमारा ‘PPTV’ मतलब ‘पीडीए प्रहरी’ चौकन्ना रहकर भाजपाई मंसूबों को नाकाम करेगा।…
— Akhilesh Yadav (@yadavakhilesh) November 14, 2025
బీహార్‌లో ఎన్డీయే కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. 243 సీట్లలో బీజేపీ+జేడీయూ+ఎల్జేపీ కూటమి ఏకంగా 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ+కాంగ్రెస్‌ల ‘‘మహాఘట్బంధన్’’ కేవలం 36 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
బీహార్‌లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. బీహార్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 243 స్థానాల్లో 197 స్థానాలను గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే , సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు.
బీహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తున్న తరుణంలో, కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల ముందే SIR జరిగిందని, ఈ ప్రక్రియలో 60 లక్షల మంది ఓటర్లను తొలగించారని, ఇది మొత్తం ఓటర్లలో 10 శాతమని, ఇవన్నీ ప్రతిపక్ష ఓట్లే అని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందే ఓట్ చోరీ జరిగిందని, సర్ వల్లే బీజేపీ, జేడీయూ గెలుస్తున్నాయని ఆరోపించారు. బీహార్‌లో ప్రతీ ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారని, కానీ అది ఎన్నికల్లో కనిపించలేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ అమ్ముడుపోయిందని, ఎన్నికల కమిషన్ బీజేపీతో కలిసి పనిచేస్తోందని కామెంట్స్ చేశారు.
#WATCH | #BiharAssemblyElections | Delhi: As NDA crosses the majority mark in Bihar, Congress MP Manickam Tagore says, "SIR was done in Bihar right before the elections. 60 lakh voters were deleted in the exercise. 10% of total voters were deleted, and the majority of them were… pic.twitter.com/ho1AX8pvtB
— ANI (@ANI) November 14, 2025
‘‘ఇది ఒక కల లాంటిది. ప్రజలు నాపై చాలా అంచనాలు ఉంచారు. తొలిసారిగా నేను ఎమ్మెల్యేగా గెలిచాను. నా ప్రజకలు నా వంతు సేవ చేస్తాను.’’అని బీజేపీ నేత, సింగ్ మైథిలి ఠాకూర్ అన్నారు. బీహార్ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థిగా ఈమె పోటీ చేశారు. అలీనగర్ నియోజకవర్గంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
బీహార్‌లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తున్న తరుణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ప్రజల ఆదేశాన్ని అంగీకరించాలి’’ అని అన్నారు.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలనం సృష్టిస్తోంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా దూసుకుపోతోంది. 243 సీట్లలో ఏకంగా 190+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఎన్డీయే కూటమిలోని మంత్రులు అంతా లీడింగ్‌లో ఉన్నారు. బీజేపీ, జేడీయూ పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలంతా ఆధిక్యంలో ఉన్నారు.
బీహార్‌లో అఖండ విజయం దిశగా ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. 243 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 193 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘట్బంధన్ దారుణమైన ఫలితాలను చవిచూస్తోంది. కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ 82 స్థానాల్లో, జేడీయూ 78 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. మిగిలిన స్థానాల్లో ఎన్డీయే మిత్రపక్షాలు ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం, బీహార్ ప్రజలకు మధ్య పోటీ నెలకొందని, ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు. తాను పార్టీల గురించి మాట్లాడటం లేదని, తాను CEC జ్ఞానేష్ కుమార్ మరియు బీహార్ ప్రజల మధ్య ప్రత్యక్ష పోటీ గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ.. ఇవి కేవలం ప్రారంభ ట్రెండ్స్ మాత్రమే అని, తాము మరి కొంత సమయం వేచి చూస్తామని అన్నారు. ప్రారంభ ఫలితాలను చూస్తే జ్ఞానేష్ కుమార్ బీహార్ ప్రజలపై పైచేయి సాధిస్తున్నాయని సూచిస్తున్నాయని, తాను బీహార్ ప్రజల్ని తక్కువ అంచనా వేయనని, వారు ధైర్యం చూపించారని, రాబోయే కొన్ని గంటల్లో ఫలితాలు మారుతాయనే ధీమాను పవన్ ఖేరా వ్యక్తం చేశారు.
#WATCH | #BiharElection2025 | Congress leader Pawan Khera says, "... The contest is directly between the Election Commission of India and the people of Bihar, and let's see who wins. I'm not even talking about parties. I'm talking about a direct, straight contest between CEC… pic.twitter.com/I1c4QSBGOg
— ANI (@ANI) November 14, 2025
‘‘బీహార్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేము గెలువబోతున్నాం. బీహార్ ప్రజలు ప్రధాని మోడీ, నితీష్ కుమార్, ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. ప్రజలు 20 ఏళ్లుగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు’’ అని బీజేపీ అధికార ప్రతిని సయ్యద్ షానవాజ్ హుస్సేన్ అన్నారు.
#WATCH | Delhi: #BiharElection2025 | BJP national spokesperson Syed Shahnawaz Hussain says, "The result is clearly visible. We are going to win. The people of Bihar have faith in PM Modi, Nitish Kumar and the NDA. The people have voted in favour of the 20 years of government..." pic.twitter.com/YHeOEG5oNn
— ANI (@ANI) November 14, 2025
ఈసారి ఎన్డీయేకు స్పష్టమైన ఆదేశం లభిస్తుందని ప్రజల ముఖాలను చూస్తే తెలుస్తోంది. ఎన్డీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్డీయే నాయకులు నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ చాలా కృషి చేశారు. ‘‘2025, మరోసారి నితీష్’’ నినాదంతో మేము నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల్లో పోరాడాము.
#WATCH | Bihar Assembly Elections Results | BJP State President Dilip Jaiswal says, "It was evident from the faces of the public that NDA is getting a mandate this time. NDA is going to form the government again. The leaders of NDA have put in a lot of effort, whether it is… pic.twitter.com/gLOaDcKge2
— ANI (@ANI) November 14, 2025
బీహార్ ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి సత్తా చాటుతోంది. 2020లో వచ్చిన ఫలితాల కన్నా మంచి ప్రదర్శన చేస్తోంది. 243 స్థానాలు ఉన్న బీహార్‌లో 122 మ్యాజిక్ ఫిగర్. ఇప్పటికే బీజేపీ+జేడీయూల కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం, ఎన్డీయే కూటమి 151 స్థానాల మార్కును చేరుకుంది. ఆర్జేడీ+కాంగ్రెస్ కూటమి కేవలం 76 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
ఓవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుతున్న సమయంలో, ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద రాహుల్ ప్రియాంకా గాంధీ సేన కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 24 అక్బర్ రోడ్ లోని కాంగ్రెస్ ఆఫీస్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. ‘‘ ఓట్ చోరీ, గద్ది ఛోడ్’’ అంటూ ఓటు దొంగతనం జరిగిందని నినాదాలు చేశారు.
#WATCH | Delhi: Members of Rahul Priyanka Gandhi Sena raise slogans of 'Vote Chori Gaddi Chhodd' and 'Pehle Lade Theyy Goron Se, Ab Ladenge Choron Se' at the Congress office, at 24 Akbar Road. pic.twitter.com/GKLqSJC1Zb
— ANI (@ANI) November 14, 2025
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన చూపిస్తోంది. మహాగట్బంధన్ కూటమిలో ఆర్జేడీ కాస్త బెటర్‌గా పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ అనుకున్నంత మేర ప్రభావం చూపడం లేదు. 60కి పైగా సీట్లలో పోటీ చేసినప్పటికీ ఇప్పటికీ 12 స్థానాల్లోనే ముందంజలో ఉంది.
బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందనే అంచనాలను ఎర్లీ ట్రెండ్స్ అందిస్తున్నాయి. ఆధిక్యంలో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ 122ను దాటింది. ప్రస్తుతం, ఎన్డీయే 130 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆర్జేడీ కూటమి కేవలం 65 స్థానాలకే పరిమితమైంది.
ఎన్డీయే కూటమిలో బీజేపీ 59, జేడీయూ 54, మిగతా స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలు ఆధిక్యం కనబరుస్తున్నాయి. ఇండియా కూటమిలో ఆర్జేడీ 43, కాంగ్రెస్ 11, లెఫ్ట్ పార్టీలు 10 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ నుంచి బహిష్కరణ గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ ముందంజలోకి వచ్చారు. ఆయన మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
బీహార్ ఎన్నికల ఫలితాల్లో రెండు స్థానాల్లో అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈ రెండు స్థానాలు కూడా సీమాంచల్ రీజియన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ముస్లిం ఓట్లు అధికంగా ఉంటాయి.
బీహార్ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ కూటమి దూకుడును ప్రదర్శిస్తోంది. ఆధిక్యంలో సెంచరీ మార్క్ దాటింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండీ కూటమి(మహాఘట్బంధన్) 57 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. బీహార్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా, అధికారం చేజిక్కించుకోవడానికి మ్యాజిగ్ ఫిగర్ 122.
మహువా నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ వెనకంజ..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే జేడీయూ ఆసక్తికర ట్వీట్ చేసింది. కొన్ని గంటల్లోనే రాష్ట్రంలో మంచి పాలన తిరిగి వస్తుందని చెప్పింది. పరోక్షంగా ఎన్డీయే గెలవబోతోందని వెల్లడించింది.
बस कुछ घंटों का इंतज़ार, फिर से आ रही है सुशासन की सरकार।#Bihar #NitishKumar #JDU #JanataDalUnited#25Se30FirSeNitish pic.twitter.com/KJJ3PEKVnY
— Janata Dal (United) (@Jduonline) November 14, 2025
బీజేపీ కీలక నేత సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి ముందంజలో ఉన్నారు. అలీనగర్ నుంచి మైథిలీ ఠాకూర్ లీడ్‌లో ఉన్నారు.
బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా లఖి సరాయ్ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు.
మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత రఘోపూర్ నుంచి ముందంజలో ఉన్నారు.
బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. మధ్యాహ్నం లోపు తేలనున్నా ఫలితాలు.. 11 గంటలకు ఏ కూటమి గెలుస్తుందో స్పష్టత రానుంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లోని 243 నియోజకవర్గాలలో అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది.
బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉంటే, 2020 ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమి 122 సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆర్జేడీ కూటమి ఆ ఎన్నికల్లో 114 సీట్లను సాధించింది. 2025 రిజల్స్ట్ ఎలా ఉండాయో అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
బీహార్ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి మాట్లాడుతూ.. ‘‘మేము గెలవబోతున్నాము. అందరికీ ధన్యవాదాలు. మార్పు రాబోతోంది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము’’ అని అన్నారు.
#WATCH | Patna: Bihar Assembly Election Results | Mahagathbandhan's CM face and RJD leader Tejashwi Yadav says, "We are going to win. Thanks to everyone. A change is about to come. We are forming the government" pic.twitter.com/p6pVag0e96
— ANI (@ANI) November 14, 2025
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా మ్యాజిక్ ఫిగర్ 122
బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సత్తు పరాఠా, జిలేబీలు తయారు చేయడం ప్రారంభించారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి గెలుస్తుందని అంచనా వేయడంతో బీజేపీ, జేడీయూ ఇతర ఎన్డీయే పార్టీ కార్యకర్తలు గెలుపు సంబరాలకు సిద్ధం అవుతున్నారు.
#WATCH | Delhi: Bihar Assembly Election Results | Sattu paratha, jalebis being prepared at the BJP Headquarters in Delhi ahead of the beginning of counting of votes for #BiharElections2025 pic.twitter.com/lfPYXKMwxR
— ANI (@ANI) November 14, 2025
ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా నియోజకవర్గంలోనిఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా నియోజకవర్గంలోని అశోక్‌ధామ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. బీహార్ కార్యకర్తలు పాట్నాలోని హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు.