జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి.. కానిస్టేబుల్ వీరమరణం జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం నుంచి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. నేడు కూడా కొనసాగింది. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. దీంతో పాటు డీఎస్పీ, ఏఎస్‌ఐకి గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ హెచ్‌సీ బషీర్ మృతి పట్ల…