వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. దీంతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్…
గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్..! అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ ఆలయ ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రతి శుక్రవారం ఈ రైలు హైదరాబాద్ నుండి అయోధ్యకు వెళుతుంది. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు…
కోరుట్ల పట్టణంలో సోమవారం గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమునిదుబ్బ ప్రాంతంలో తమ ఇంటి డాబాపై ఇద్దరు చిన్నారులు తోకల సాత్విక్, ప్రశాంత్ గాలిపటం ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే దారం విద్యుత్ తీగలలో ఇరుక్కుపోయింది. తీగలలోని దారాన్ని తీసేందుకు ప్రయత్నించగా, బాలురు విద్యుత్ వైరుకు తగిలి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి…
బొంబాయిలోని చౌపాటీ బీచ్‌లో సోమవారం జరిగిన జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ సెయిలర్లు మెరిశారు. వారు మొదటి పదకొండు స్థానాల్లో ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు, మొత్తం మూడు పతకాలను గెలుచుకున్నారు. హైదరాబాద్‌లోని రసూల్‌పురాకు చెందిన దీక్షిత కొమరవెల్లి బాలికల పోటీలో బంగారు పతకం, ఓవరాల్ ప్రదర్శనతో కాంస్య పతకం సాధించింది. అనేక అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే జాతీయ జట్టులో దీక్షిత కూడా స్థానం సంపాదించింది. బన్నీ…
2024 సంవత్సరానికి సంబంధించి తమ ట్రేడ్ లైసెన్స్‌ను అదనపు ఖర్చు లేకుండా జనవరి 31లోగా పునరుద్ధరించుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నగరంలోని వ్యాపారులను కోరింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 మధ్య తమ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయించుకోవాలనుకునేవారు 25 శాతం జరిమానా చెల్లించాలి. ఏప్రిల్ 1 తర్వాత రెన్యూవల్ చేసుకునే వారికి 50 శాతం జరిమానా విధించబడుతుంది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడుస్తున్న ఏదైనా వ్యాపారం 100 శాతం ఆకర్షిస్తుంది. పెనాల్టీ, లైసెన్స్…
హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం…
పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను డిస్కౌంట్‌తో క్లియర్ చేసే తేదీని జనవరి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పొడిగించింది. ప్రజల నుండి ప్రోత్సాహకరమైన స్పందన దృష్ట్యా తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లపై రాయితీ గడువు పొడిగింపు జనవరి 10 నుండి జనవరి 31 వరకు సవరించబడింది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా…
10 సంవత్సరాలుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల కింద 813 మందికి కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ అధికారులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ…
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీ-ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్ తో పాటు…
వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు.. అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే శంకరనారాయణ, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి…