తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా? 30 వేల మంది కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ఆయన మండిపడ్డారు. పిచ్చోడిలా బీజేపీ నేతలు తిరుగుతున్నారని, చేతగాక వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారన్నారు. బహిరంగ సభలో…
ఎప్పుడూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్న ఇక నుంచి తాను సీఎం కేసీఆర్‌ను తిట్టనని శపథం పూనారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిన్న నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సమావేశానికి తీన్మార్ మల్లన్న హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని, అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాడతానని ప్రకటించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే తన…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వంతగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా” ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.…
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాంగణంలో గత అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీ దుకాణం యజమానికి కన్నడ భక్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగేందుకు వెళ్లిన కన్నడ భక్తుడు టీ దుకాణదారుడితో మంచినీళ్లు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. దీంతో రెచ్చిపోయిన టీషాపు యజమాని సదరు కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఈ విషయం తెలిసిన కర్ణాటక భక్తులు రెచ్చిపోయారు.…
తిరుపతిలోని చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే రెడ్ శ్యాండిల్ టాస్క్ఫోర్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని…
Telangana State ERC Green Signal to Electricity Bill Hike. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై పెనుభారం మోపేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వంటనూనె ధరలు ఆకాశనంటుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ప్రజలు నడ్డి విరయడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు తెలంగాణలో 14 శాతం విద్యుత్ ఛార్జీల పెంచుతున్నట్లు…
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక ముగ్గరు పిల్లలతో సహ అగ్నికి ఆహుతి అయిన కేసులో మాజీ ఎంపీ రాజయ్య కు ఊరట లభించింది.. హైదరాబాద్ స్పెషల్ కోర్టులో రాజయ్యతో సహా నిందితులుగా ఉన్న ఆయన కొడుకు భార్యలను కూడా కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ, సిరిసిల్ల రాజయ్య ఇంటిలో 2015 నవంబర్ 4 తెల్లవారుజామున అగ్ని ప్రమాదం…
TS EAMCET 2022 Schedule. తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణలో వ్యవసాయ, ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ నిర్వహణ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. 18, 19, 20…
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తింది. బోధన్‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతలోనే ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా…
Telangnaa IT Minister KTR Got Grand Welcome At America Tour. మంత్రి కే తారకరామారావు కి అమెరికాలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో మంత్రి కే. తారకరామారావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో మంత్రి…