సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు. అమాయకులైన ప్రజలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరోవైపు మరి కొందరు.. రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వివాదస్పద పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా నిన్న హ్యాక్‌కు గురైంది. ఆయన ఖాతాను తమ అధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు క్రిప్టో కరెన్సీ ద్వారా…
ఆదివాసి కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమక్క సారక్క జాతరకు బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడారం జాతరకు నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు సమక్క సారక్కలను దర్శించేందుకు వస్తుంటారు. అంతేకాకుండా తెలంగాణకే సమక్క సారక్క జాతర తలమానికంగా నిలిచింది. అయితే మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీస్ శాఖ 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో…
ఈశాన్య చైనాలో శనివారం బస్సు పేలి ఒక వ్యక్తి మరణించగా, 42 మంది గాయపడినట్లు పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. పేలుడు సంభవించినప్పుడు తమకు పెద్ద శబ్ధం వినిపించిందని, అయితే బస్సులో మంటలు చెలరేగలేదని సాక్షులు తెలిపారు. లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, 42 మంది తీవ్రంగా గాయపపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. మరో 40 మందికి స్వల్ప…
మోడీ పార్లమెంట్‌లో అసభ్యకరంగా మాట్లాడాడని, పనికి మాలిన మాటలు చెప్పారని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వాసం కల్పించాల్సిన వారు విద్వేషాలు రెచ్చగొట్టారని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రధాని లేరని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా చేవెళ్ల ప్రాణహిత కోసం జాతీయ హోదా ఇవ్వలేదని, రైతు చట్టాలను పోరాటాలు ద్వారా వెనక్కి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధి…
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి హైదరాబాద్ లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సైబర్ దాడిలో మహేష్ బ్యాంకు నుంచి నిందితులు రూ. 12 కోట్లు మాయం చేశారు. ఈ 12 కోట్లను సైబర్ 120 అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు, మహేష్ బ్యాంకు మెయిన్ సర్వర్ పై ఈ దాడి జరిగినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు…
బీజేపీ పై మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని మొత్తం లాగేసుకునే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి నియంత పాలనను….ఎప్పుడూ చూడలేదని, బీజేపీ వైఖరి మారక…
నవమాసాలు మోసి కన్న తల్లినే కొడుకు కడతేర్చిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో సైకో కొడుకు సుధీర్ రాడ్ తో తల్లిని తలపై కొట్టాడు. అంతేకాకుండా అడ్డు వచ్చిన చెల్లెను సుధీర్ కూడా రాడ్ తో కొట్టాడు. అయితే ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న సుల్తాన్…
ఏపీలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్ లో అధికార వైసీపీ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ ఫోర్స్ పెట్టి క్లబ్ లు మూయించిన మాట వాస్తవం కాదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ…
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఆ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం సమయంలో పరిమితి మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకునే ఖర్చును సవరణలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు.. అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలకు ఎంత మేర ఖర్చు చేయొచ్చనే అంశంపై సవరణ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజవర్గానికి రూ. 95 లక్షలు,…
రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది కరోనా మహమ్మారి. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ రూపంలో సెకండ్ వేవ్ సృష్టించిన కరోనా రక్కసి ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్‌కు బాటలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత నెల మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా సుమారు 9 వేల లోపు కరోనా కేసులు నమోదుకాగ, తాజాగా ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 90వేల పై చిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర…