సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ ఫైట్ అనేది ఏ భాష అయినా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు మరో భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతోంది. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్స్ తగ్గేదే లేదంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. భీమ్లా నాయక్, రాధే శ్యామ్ రెండు చిత్రాలూ ఒకరోజు గ్యాప్ తో ఒకేసారి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు ‘రాధే శ్యామ్’తో క్లాష్…