శుక్రవారం జనం ముందుకు రాబోతున్న 'తోడేలు' సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. 'అంతా ఓకేనా...' అంటూ సాగే ఈ రోడ్ ట్రిప్ సాంగ్ ను వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్ పై చిత్రీకరించారు.
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన 'తోడేలు' చిత్రం నుండి మరో పాట విడుదలైంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్ ను అల్లు అరవింద్ గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.
ప్రముఖ పంపిణీ సంస్థ గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్స్ 'భేడియా' తెలుగు వర్షన్ 'తోడేలు'ను పంపిణీ చేయబోతోంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.
Bhediya:బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా బేడియా. ఈ చిత్రాన్ని తొలి క్రియేచర్ కామెడీ మూవీగా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కిస్తున్నారు.