Bhediya: ‘బేడియా’ నుంచి తుంకేశ్వరి పాట విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhediya:బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా బేడియా. ఈ చిత్రాన్ని తొలి క్రియేచర్ కామెడీ మూవీగా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాత. హిందీతో పాటు తెలుగులో “తోడేలు” టైటిల్ తో నవంబర్ 25న రిలీజ్ కాబోతోంది. తాజాగా బేడియా సినిమా నుంచి తుంకేశ్వరి అనే పాటను విడుదల చేశారు. డాన్స్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట ఫిల్మ్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తుంకేశ్వరి పాటలో వరుణ్, కృతి డాన్సులు ఆకర్షణ అయ్యాయి. ఈ పాటలో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ చేసిన స్పెషల్ అప్పీయరెన్స్ అసలైన హైలైట్ గా చెప్పుకోవచ్చు. సచిన్ జిగర్ స్వరపర్చిన ఈ పాటకు గణేష్ ఆచార్య అదిరిపోయే స్టెప్పులు కొరియోగ్రాఫ్ చేశారు.ఈ పాటను తెలుగు లో కార్తీక్,అనూష మణి పాడారు. ఈ పాట గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ..ఫ్లోర్ అదిరిపోయే డాన్స్ నెంబర్ ఇది. థియేటర్ లో ఆడియెన్స్ ఈ పాటకు స్టెప్పులేస్తారు. ఈ పాటలో పర్మార్మ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. క్యాచీ లిరిక్స్, మంచి ట్యూన్ తో పాట మీకు బాగా నచ్చుతుంది. అన్నారు. కృతి సనన్ మాట్లాడుతూ..వరుణ్ సరసన ఇలాంటి పాటలో కనిపించి చాలా రోజులవుతోంది. ఈ పాట షూటింగ్ టైమ్ ను ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి ఎక్సీపిరియన్స్. అని చెప్పింది.
తోడేలు గాయపర్చిన తర్వాత కథానాయకుడు భాస్కర్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. తోడేలులా మారిన అతని వైల్డ్ బిహేవియర్ కు కారణాలేంటో తెలుసుకునే క్రమం అంతా ఆసక్తికర అంశాలతో సర్ ప్రైజింగ్ గా సాగుతుంది. ఈ కథను అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాది నవంబర్ 25న బేడియా/తోడేలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్రీడీ ఫార్మేట్ లోనూ ఈ సినిమా విడుదలవుతుండటం విశేషం.
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!