ఓలా ఎలక్ట్రిక్ తన తదుపరి జనరేషన్(మూడో జనరేషన్) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జనవరి 31, 2025న విడుదల చేయనుంది. మూడో జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో తీసుకురావాలని భావించిన కంపెనీ.. తన ప్రణాళికను మార్చుకుంది. ఈ కొత్త స్కూటర్‌లో అనేక ఫీచర్స్ పొందుపరిచినట్లు, పలు సవరణలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో 3 ప్లాట్‌ఫారమ్‌లో…
క్రిస్మస్ సందర్భంగా భవిష్ అగర్వాల్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 4000కు చేరింది. ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారు కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా తెలిపారు.
దేశంలో ఈ-వాహనాలు, ముఖ్యంగా ఈ-స్కూటర్ల పోరు మార్కెట్‌లో చాలా తీవ్రంగా మారింది. చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. పండుగల సీజన్‌లో విక్రయాలు పెంచుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు.
కొన్ని నెలల క్రితం వరకు ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా భారతదేశానికి వస్తుందని చాలా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ కంపెనీకి వచ్చే ఉద్దేశం లేనట్లు తెలుస్తోంది.