ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పున:ప్రతిష్ట మహోత్సవం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ. 4 కోట్ల 74 లక్షల 50 వేల రూపాయలను కేటాయించారు. పున:ప్రతిష్ట కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆరాధ్యదైవంగా ఉందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే…
Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ( మే 27వ తేదీ) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో త్రిమెన్ కమిటీ అధికారుల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎంకు వారు వివరించారు.
నేడు గుజరాత్ పట్టణ ప్రగతి పథం వేడుకలు. వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. పీఎం ఆవాస్ యోజన లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ. స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులు విడుదల. ఐపీఎల్లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్ ప్రారంభం. ఫేవరెట్గా బరిలో దిగనున్న తెలుగమ్మాయి జ్యోతి. గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన జ్యోతి. కడప జిల్లా : నేటి నుంచి కడపజిల్లా…
Deputy CM Bhatti: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టకుండా ఎలా ఇస్తున్నారు.. ఉన్నవన్నీ కాంగ్రెస్ పార్టీ హయంలోనివే అని చెప్పాను.. భద్రాద్రి, యాదాద్రి నుంచి కరెంటు ఉత్పత్తి కాలేదని చెప్తే కేసీఆర్ నుంచి సమాధానం లేదు.. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు సాగుతున్నాం.
Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడికి కోటి రూపాయల బీమా చెక్కు ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్లో ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేసిన జోగు నరేశ్ కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును, ఆయన భార్యకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, “ఇలాంటి గొప్ప నిర్ణయం కేవలం సీఎం…
Bhatti Vikramarka : జూన్ 2వ తేదీన ఐదు లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న లక్ష్యాన్ని సమయానికి సాధించేందుకు బ్యాంకర్ల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం, రాష్ట్రం అభివృద్ధి…
Funds Release: గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ విడతలో చెల్లించడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి…
తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు.
Bhatti Vikramarka: భద్రాద్రి కొతగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో గల బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అన్నారు.
Sandeep Kumar Sultania: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పదవిలోకి సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె. రామకృష్ణారావు కొనసాగుతుండగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…