ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు 'భాష్యం' విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. ఆపన్నులను ఆదుకోవడంలో సామాజిక బాధ్యతగా ముందుండే భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహాయమందించేందుకు విద్యాసంస్థల తరపున మొత్తం రూ. 4 కోట్ల చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చందబ్రాబునాయుడును కలిసి భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు, భాష్యం రామకృష్ణ తనయుడు భాష్యం…