మా పాదయాత్రతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మను దర్శించుకున్న ఆయన.. 5వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని ఆరోపించారు.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నానని.. ఇప్పటివరకు నాలుగు విడతలుగా…
Bhanu Prakash Reddy: తిరుపతిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ ప్రభుత్వం క్రీస్తుప్రదేశ్‌గా మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా రిసిప్ట్‌పై క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమని భానుప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా సీఎం జగన్ మౌనమునిలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలు దూప దీప…
Somu Veerraju: ఏపీలో చర్చిల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.175 కోట్ల నిధులను చర్చిల నిర్మాణాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని చర్చిల కోసం ఇవ్వడమేంటని నిలదీశారు. చర్చిల నిర్మాణానికి నిధుల కేటాయింపుపై కోర్టుకెళ్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో టీడీపీ – వైసీపీ మిలాఖత్ అయ్యాయని.. రాజధాని నిర్మాణ…
GVL Narasimha Rao: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణ చీప్ పబ్లిసిటీ అన్నారు. కట్టుకథలు, కాల్పనిక విషయాలు సృష్టించి రాజకీయ సంచలనం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఆయన పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన కట్టు కథ అల్లుతున్నారని.. కేసీఆర్‌ను ఏమైనా వైసీపీ స్పోక్స్ పర్సన్‌గా నియమించారా అని ప్రశ్నించారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్‌కు ఎందుకు అని నిలదీశారు.…
Vishnu Vardhan Reddy: ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ కీలక నేతలందరూ విశాఖలోనే మకాం వేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ లైన్, జనసేన లైన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లకుండా చూసుకోవడమే బీజేపీ-జనసేన ముందున్న ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు.…
SatyaKumar: ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అయినా తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సత్యకుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించాలన్న…
CM Ramesh: రాజ్యసభ ఎథిక్స్ కమిటీని పునర్‌వ్యవస్థీకరిస్తూ సభ కార్యాలయం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ ప్రకాష్ జవదేకర్‌ను నియమించింది. అటు ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేష్‌కు అరుదైన అవకాశం దక్కింది. హౌస్ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రమేష్‌ను నియమించింది. ఈ నియామకాలకు సంబంధించి సభ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజ్యసభ నుంచి ఈ నెల…
Poonam Kaur: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్ కలిసింది. ఈ మేరకు కాసేపు రాహుల్ గాంధీతో కలిసి పూనం కౌర్ పాదయాత్రలో పాల్గొంది. అయితే రాహుల్ గాంధీని పూనమ్ కౌర్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. రాహుల్ చేయిని పూనమ్ కౌర్ పట్టుకున్న ఫోటోను బీజేపీ కార్యకర్త ప్రీతి గాంధీ పోస్ట్ చేయగా అది…
Andhra Pradesh: ఏపీ బీజేపీలో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ చీఫ్ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే వచ్చిందని.. పార్టీలో వ్యవహారాలన్నీ ఆయన ఒక్కడే అన్ని చూసుకోవడంతో సమస్య ఉత్పన్నమైందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన…
Kishan Reddy: అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు దూకుడు ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకిచ్చారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాల్లో కక్షసాధింపు…