VishnuVardhan Reddy: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ఓ డ్రామా అని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తామని ఇతర ఎమ్మెల్యేలు కూడా డ్రామా ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయకపోవడం అందులో చిత్తశుద్ధి లేకపోవడమేనన్నారు. రాజీనామా ఆమోదించాలని రాజీనామా చేయడం లేదని.. చిత్తశుద్ధి ఉంటే ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు…
Somu Veerraju: విశాఖలోని దసపల్లా భూముల అన్యాక్రంతంపై సీఎం జగన్‌కు మంగళవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. విశాఖ నగరంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని లేఖలో కోరారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం…
Satyakumar: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దసరా పండగ సందర్భంగా జాతీయ పార్టీపై ప్రకటన చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ నేతలు తమకు టచ్‌లోనే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలతో కేసీఆర్ నేరుగా మాట్లాడారని లీకులు ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. ఏపీలో ఒక్క బీజేపీ కార్యకర్తను అయినా కేసీఆర్…
Election Survey: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఆమ్‌ఆద్మీ కూడా పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ మేరకు గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కమలం పార్టీనే విజయం సాధిస్తుందని సర్వే రిపోర్టుల్లో…