Kamal Haasan on Bharateeyudu Remuneration: బ్లాక్ బస్టర్ చిత్రం ‘భారతీయుడు’ గురించి లోకనాయకుడు కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయుడు సినిమాలో తాను భాగం కావాలనుకోలేదని తెలిపారు. డైరెక్టర్ ఎస్ శంకర్ తనంతట తానుగా తనను తప్పించాలని కావాలనే రెమ్యునరేషన్ పెంచానని, కానీ నిర్మాతలు అంగీకరించడంతో సినిమాలో నటించానని చెప్పారు. శంకర్ పట్టుదల తాను ఆశ్యర్చపోయానని కమల్‌హాసన్ పేర్కొన్నారు. 1996లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.…