కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో రెండు డోసులుగా అందించారు. అయితే, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌లు విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ పెరిగిపోతున్నది. కొన్ని దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోసులను అందిస్తున్నారు. భారత్ బయోటెక్ బూస్టర్ డోసులను ఇంజెక్షన్ రూపంలో కాకుండా చుక్కల మందు రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నది. Read: What’s Today : ఈ రోజు…
కోవాగ్జిన్ టీకాపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ తీవ్ర లక్షణాలు సోకకుండా కోవాక్సిన్ 93.4 శాతం కాపాడుతుందని.. ప్రకటించింది భారత్ బయోటెక్. కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయిల్ డేటాను లాన్‌సెట్ ప్రచురించిందని… క్లినికల్ ట్రాయల్స్ లో పాల్గొన్న వారిలో 0.5% కంటే తక్కువ మందిలో తీవ్ర దుష్పరిణామాలు ఉన్నాయని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకకుండా 65.2 శాతం కాపాడగలదని పేర్కొంది భారత్ బయోటెక్. అన్ని రకాల కోవిడ్ స్ట్రైన్స్ నుంచి 70.8 శాతం…
కరోనాకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ స్పూత్నిక్ వీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ చిన్నపిల్లలకు ఇప్పటి వరకు టీకా అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే జైడస్ వ్యాక్సిన్ ఉన్న అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. ఈ క్రమంలోనే భారత్‌బయోటెక్ మరో ముందడుగు వేసి శుభవార్తను చెప్పింది. భారత్ బయోటెక్ యూఎస్ భాగస్వామి ఆక్యూ జెన్ చిన్నపిల్లలకు కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని యూఎస్ అధికారులను కోరింది. 2నుంచి18ఏళ్ల మధ్య వయస్సున్న వారికి ఈ వ్యాక్సిను అత్యవసర వినియోగానికి దరఖాస్తు…
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుభవార్త చెప్పింది.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ సంస్థ భారత్ బయోటెక్‌తో పాటు.. ఆ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ఎంతో కాలంగా డబ్ల్యూహెచ్‌వో అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇక, ఇవాళ అందరికీ శుభవార్త చెప్పింది డబ్ల్యూహెచ్‌వో.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌కు అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)కు ఆమోదం తెలిపింది.. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఆరు వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి.. కోవిషీల్డ్, స్పుత్నిక్…
కరోనాపై పోరాటానికి భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వినియోగ గడువును ఏడాది పాటు పొడిగించారు.. ఈ మేరకే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO).. వాక్సిన్ తయారీ తేదీ నుంచి ఏడాది పాటు వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది.. ఈ విషయాన్ని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ప్రకటించింది.. అయితే, వ్యాక్సిన్ వినియోగ గడువును 24 నెలలకు పొడగించాలంటూ.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. దానితో పాటు…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్ నుంచి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కోవాగ్జిన్, కోవీషీల్డ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంచుకుంది.. ఇక, ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లకు సైతం ఆమోదం తెలిపింది కేంద్రం.. దీంతో.. మరికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయతే, భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, త్వరలోనే తేల్చేందుకు మాత్రం…
భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, 18 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ అందించేందుకు భారత్ బయోటెక్ సిద్ధం అవుతున్నది. ఇప్పటికే చిన్నారుల కోసం తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ సంస్థ పూర్తిచేసింది. ఈ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను భారత ఔషద…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో టీకా మాత్రమే మొదట అందుబాటులోకి వచ్చింది.. ఆ తర్వాత పౌడర్ రూపంలో కూడా మరో మందు మార్కెట్‌లోకి వచ్చింది.. ఇక, త్వరలోనే ముక్కు ద్వారా వ్యాక్సిన్ పొందవచ్చు.. ఎందుకంటే… కరోనా టీకా విషయంలో భారత్ బయోటెక్ సంస్థ మరో ముందడుగు వేసింది… ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది.. భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు…
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన రోటావాక్-5డికి ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం తెలిపింది. పిల్లలకు వ్యాపించే రోటా వైరస్ నుంచి రక్షణ కోసం ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఇప్పటికే రోటావాక్ ను తయారు చేసిన ఈ సంస్థ మరింత రక్షణ కోసం 5డీని తయారు చేసింది. ఈ 5డి వ్యాక్సిన్‌కు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం తెలిపింది. రోటావాక్ 5డి పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తుందని, అంతేకాకుండా నిల్వ, సరఫరాకు కూడా…
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు వయసుపైబడిన వారికి కరోనా టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదవ్వడానికి ఇదికూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లలోపున్న పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెలలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు బీజేపీ ఎంపీలతో పీఎం మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్…