‘రెబల్ స్టార్’గా జనం మదిలో నిలచిన కృష్ణంరాజును నటునిగా ఓ మెట్టు పైకి ఎక్కించిన చిత్రం ‘భక్త కన్నప్ప’. బాపు, రమణ రూపకల్పనలో రూపొందిన ‘భక్త కన్నప్ప’తో నటునిగా కృష్ణంరాజుకు ఆ రోజుల్లో మంచి పేరు లభించింది. తొలి చిత్రం ‘చిలక-గోరింక’లోనే కథానాయకునిగా నటించిన కృష్ణంరాజు ఆ తరువాత చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా కూడా నటించారు. కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లోనూ కనిపించారు. హీరోగానూ కొన్ని సినిమాల్లో నటించినా, అవేవీ…