మావోయిస్టు వారోత్సవాల నేపద్యంలో తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయ్యింది. జిల్లాల వారీగా టార్టెట్ చేస్తూ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. నేటి నుండి ఈ నెల 8వరకు జరగనున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలపై పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న బుధవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే.. ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నేడు గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో…
పోడు రైతుల చలో ప్రగతిభవన్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజామున సర్పంచ్ మడకం స్వరూప సహా గ్రామస్థులను అరెస్ట్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ చలో ప్రగతిభవన్కు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే, ఎంపీపీ తక్షణమే రాజీనామాలు చేయాలని పోడు రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న గతంలో లాగే పోడు వ్యవసాయం చేసేందుకు గిరిజనులు సన్నద్ధం కావడంతో.. అధికారులు వీరిని అడ్డుకుకోవడంతో.. గిరిజనులు, అధికారులు మధ్య…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా బంకుల్లో డీజిల్ లేకపోవడంతో వాహనదారులు ఉదయం నుండి సాయంత్రం దాకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ సీజన్ మొదలైన నందున రైతులు తమ టాక్టర్ లకు డీజిల్ కోసం పెద్ద పెద్ద క్యాన్లతో పెట్రోల్ బంకుల ముందు బారులు తీరి ఉన్నారు. అయితే పెట్రోల్ బంకు ఈ సాయంత్రం ట్యాంకరు రావడంతో డీజిల్ కోసం రైతులు ఇతర…
తెలంగాణ ఏర్పడ్డ తరువాత కరెంటు కోత ఉండకుండా ఉండేందుకు నిర్మించిన పవర్ ప్రాజెక్టులపై వివాదాలు ముసురుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపై అధికార పార్టీలు అయిన టీఆర్ఎస్ బిజెపిల మధ్య వార్ కొనసాగుతుంది. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ.. బీజేపీ ఆధ్వర్యంలోని శాఖల ఆధ్వర్యంలోనే పనులు జరిగాయి కదాఅని టీఆర్ఎస్ లు వాద ప్రతివాదాలు చేసుకుంటున్నారు. కాగా.. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణలో కరెంటు దొరకదని ఆనాడు ఆంధ్ర వాదులు, అక్కడి…
ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం కెసిఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? అని చురకలంటించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సామాగ్రిని కేంద్ర ఆధీనంలో ఉన్న బిహెచ్‌ఇఎల్ ఇచ్చిందన్నారు. టెండర్ల ద్వారా బిహెచ్‌ఇఎల్…
రంగారెడ్డి జిల్లాలో 12యేళ్ల బాలికకు 35యేళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. అదీ బర్త్ డే చేస్తున్నామన్న పేరుతో తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించారు. దీంతో పోలీస్ కేసు నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుక పేరుతో ఈ వివాహ వేడుకను నిర్వహించారు తల్లిదండ్రులు. అయితే తనకు ఈ పెళ్లి…