భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం చర్చ్ రాం పెడ్ గ్రామంలో రైతు గోస మహా ధర్నా లో పాల్గొన్నారు వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ హయాంలో 3లక్షల 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పేదలకు ఇంకా 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చే వారన్నారు. వైఎస్సార్ తర్వాత తెలంగాణలో ఒక్క ఎకరాకి పట్టా ఇవ్వలేదు. కుర్చీలేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడంటూ రైతు గోస సభలో…
తెలంగాణలో ప్రభుత్వానికి-రాజ్ భవన్ కి మధ్య అగాథం పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. వరుస పర్యటనల్లో ఆమెకు అవమానంగా జరుగుతోందని మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. స్రోటోకాల్ సమస్య పై చెప్పాల్సిన చోట చెప్పానన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ పట్ల అధికారులు అనుసరిస్తున్న ప్రోటోకాల్ సమస్యపై చెప్పాల్సిన చోటే తాను చెప్పానని ఇప్పుడు దాని గురించి మాట్లాడేది ఏమీ లేదని గవర్నర్ తమిళ సై వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు…
https://www.youtube.com/watch?v=tlb10ojL91g భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వాముల వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం గం.10-30 లకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. 11వ తేదీన శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. శ్రీసీతారామచంద్ర స్వాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేశారు. 2.5లక్షల తలంబ్రాల పాకెట్లు సిధ్దం చేశారు. భద్రాద్రి ఆలయాన్ని రంగురంగుల విద్యుదీపాలతో అలంకరించారు. రేపు జరిగే…
రెండేళ్ల తరువాత మళ్లీ శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతుంది. భద్రాచలంలో మిథిలా స్టేడియంలో రాముల వారి కళ్యాణం జరుగనుంది. కరోనా వల్ల ఈ రెండేళ్ల పాటు భక్తులు లేకుండా కళ్యాణాన్ని నిర్వహించిన దేవస్తానం ఇప్పుడు మాత్రం భక్తుల సమక్షంలోనే కళ్యాణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లను చేసింది. శ్రీరాముడిని హోలీ పండుగ రోజే పెళ్లి కుమారుడిని చేయడం ఆనవాయితీ.. అదే ఆనవాయితీని ఈరోజు స్వామి వారి పెళ్ళికొడుకుని చేసిన అనంతరం వసంతోత్సవం, డోలోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాచలంలో…