తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత, మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క మరికొద్ది సేపట్లో ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయం నుంచి భద్రాచలంలో గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి బయలుదేరుతున్నారు. గోదావరి వరద జలాలతో నిండిపోయిన భద్రాద్రి రామాలయం, పరిసర ప్రాంతాలు, కరకట్ట మీదుగా గోదావరి బ్రిడ్జి, కూనవరం రోడ్డు, భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మూసివేసిన రోడ్లు, వరద తీవ్రతను పరిశీలిస్తారు. భద్రాచలంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావసకేంద్రాన్ని సందర్శించి వరద బాధితులను పరామర్శిస్తారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల గురించి ఆరా తీసి వారి సమస్యలు తెలుసుకొని, అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఉన్నత అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యలను వివరించనున్నారు.
MP Arvind : ఎంపీ అర్వింద్‌కు అమిత్ షా ఫోన్.. దాడిపై ఆరా..
అదేవిధంగా అకాల వర్షాలతో అతలాకుతలమైన అన్నదాతల పంట పొలాలను కూడా పరిశీలిస్తారు. గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాలతో గోదవరి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే భద్రాద్రిలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటడంతో.. అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.