భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా బంకుల్లో డీజిల్ లేకపోవడంతో వాహనదారులు ఉదయం నుండి సాయంత్రం దాకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ సీజన్ మొదలైన నందున రైతులు తమ టాక్టర్ లకు డీజిల్ కోసం పెద్ద పెద్ద క్యాన్లతో పెట్రోల్ బంకుల ముందు బారులు తీరి ఉన్నారు.
అయితే పెట్రోల్ బంకు ఈ సాయంత్రం ట్యాంకరు రావడంతో డీజిల్ కోసం రైతులు ఇతర వాహనదారులు గంటల తరబడి లైన్ లో నిలబడి ఉన్నారు. పెట్రోల్ బంకులు వాహనదారుల తో కిక్కిరిసి పోతున్నాయి. గందరగోళ పరిస్థితి ఉంది. కొన్ని బంకు లకు అసలు డీజిల్ లేదు. నో స్టాక్ బోర్డు పెట్టారు. దీంతో డీజిల్తో నడిచేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ గా నిలిచి పోవడం వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం తరువాత కేంద్ర ప్రభుత్వం టాక్సీలు పెంచడం వలన డీలర్లు నష్టపోతున్నారు. దీనివల్ల చాలా మంది డీలర్లు డీజిల్ అమ్మకాలను నిలిపివేశారని గత రెండు రోజుల క్రితం జరిగిన ఆర్మీ అభ్యర్థుల ఆందోళన ఫలితంగా రైళ్ల దగ్ధం చేసిన సంఘటన వలన రవాణా నిలిచిపోయి ఫలితంగా డిజిల్ కూడా సప్లై కావడం లేదని ఇల్లందు పెట్రోల్, డీజిల్ బంక్ యజమాని సతీష్ తెలిపారు.
కాగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల దగ్గరకు వాహన దారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పెట్రోల్ షార్టేజ్ అని తెలుసుకున్న వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ ల దగ్గర క్యూ కట్టారు. మహిళలు సైతం తమ వాహనాలతో క్యూలైన్లో నిల్చున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.
అయితే రాబోయే రోజుల్లో పెట్రోల్ , డీజల్ కొరత రాబోంతుందనే ఈఘటనే నిదర్శమని చెప్పొచ్చు. ఇప్పుడే పెట్రోల్ బంక్ లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు అలర్ట్ అయి సరిపడా పెట్రోల్ ను నిల్వ ఉంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
Ranbir Kapoor: ‘షంషేరా’ నుండి లీకైనా రణ్‌బీర్ ఫస్ట్‌లుక్..