ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ చౌక ప్లాన్‌లను అందించేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే అనేక ప్రత్యేక ప్రణాళికలను బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్రతి టెలికాం కంపెనీ రీఛార్జ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.. దీంతో.. కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ (BSNL) వైపు మళ్లుతున్నారు. దీంతో.. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ కొత్త ప్లాన్‌లను అందిస్తోంది.