పెళ్లంటే ఎంత సంతోషం.. ఉల్లాసం ఉంటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారంటే.. అబ్బాయి-అమ్మాయికి ఎన్నో ఊహాలు ఉంటాయి. భార్యాభర్తలు అయ్యాక.. ఎన్నో ప్రణాళికలు.. ఎన్నో కలలు ఉంటాయి. అలాంటిది పెళ్లి కాక ముందే.. ఓ వరుడు చేసిన పనులకు వధువు అసహ్యించుకుని పెళ్లి పీటల మీద నుంచి దిగి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.
సూర్య భార్య దేవిషా శెట్టి తన భర్త పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నిండిన ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవిష పెట్టిన పోస్ట్‌కి సూర్య ఒక్క మాటలో సమాధానమిచ్చి తన భావాలను మొత్తం బయటపెట్టాడు.
చిరకాల మిత్రుడు అకస్మాత్తుగా కన్నుమూస్తే ఆ బాధ మామూలుగా వుండదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తన చిరకాల మిత్రుడు ఆకస్మికంగా మృతి చెందటంతో నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి కడవరకు సాగనంపారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సత్తుపల్లి పట్టణ ప్రముఖులు సత్తుపల్లి మాజీ ఉపసర్పంచ్, మాజీ కౌన్సిలర్ తుళ్లూరు ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. తుళ్లూరు ప్రసాద్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సన్నిహితులు. ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు.…