ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చెన్నై సూపర్ కింగ్స మరో కీలక పోరుకు సిద్దమైంది. చెపాక్ స్టేడియం వేదికగా ఇవాళ ( శుక్రవారం ) సైన్ రైజర్స్ హైదరాబాద్ తో సీఎస్కే టీమ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అడతాడని సమాచారం. చేతి వేలి గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్న ఈ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఇప్పుడూ పూర్తిగా ఫిట్ నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతను నెట్ లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు.
Also Read : Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్
ఈక్రమంలో బెన్ స్టోక్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ఉందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది సీజన్ లో స్టోక్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు మ్యాచ్ లు కలిపి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ లోనైనా స్టోక్స్ తన మార్క్ చూపించాలని సీఎస్క్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 2023 మినీవేలంలో ఇంగ్లండ్ టెస్ట్ సారథి బెన్ స్టోక్స్ ను రూ. 16.25 కోట్ల భారీ ధకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్ లు గెలిచి.. రెండింట ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.
Also Read : Allu Arjun : కూతురితో అల్లు అర్జున్.. క్యూట్ వీడియో
సీఎస్కే జట్టు అంచనా : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ( C&WK), తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, ఆకాస్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా అంబటి రాయుడు వచ్చే అవకాశం ఉంది.