Ben Stokes Record: బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన చోటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes Joins Jacques Kallis and Sir Garfield Sobers Elite List: యాషెస్ సిరీస్ 2023లో కీలకమైన మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ఆటలో మొత్తం 11 వికెట్లు పడడంతో.. మ్యాచ్ మలుపులు తిరుగుతూ సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. ప్రస్తుతం ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సాధించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తక్కువ పరుగులే పరిమితం అయినా బెన్ స్టోక్స్ మాత్రం 80 పరుగులు చేశాడు. తన బజ్‌బాల్ ఆటను ఆస్ట్రేలియాకు మరోసారి రుచి చూపించాడు. మొదట క్రీజులో కుదురుకునేందుకు స్టోక్స్ సమయం తీసుకున్నాడు. 168 పరుగుల వద్ద మార్క్ వుడ్ (24) ఎనిమిదో వికెట్ రూపంలో ఔట్ కాగానే.. స్టోక్స్ గేర్ మార్చాడు. అప్పటికి స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత 39 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఫోర్లు సిక్సులు బాదుతూ 106 బంతుల్లో 80 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
Also Read
Also Read: Okaya EV Scooters Offers: ఒకయా ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్!
హాఫ్ సెంచరీ చేసే క్రమంలో బెన్ స్టోక్స్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 6 వేల పరుగులు, వంద వికెట్లు సాధించిన మూడో ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటివరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయగా.. 197 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 6 వేల పరుగులు, వంద వికెట్లు సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్ ఉన్నాడు. కలిస్ 13,289 పరుగులు.. 292 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో విండీస్ దిగ్గజం సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ 8,032 పరుగులు.. 235 వికెట్లు తీశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ ఆదుకోకపోతే ఇంగ్లండ్ పరిస్థితి దారుణంగా ఉండేది. మూడో రోజు రెండో బంతికే జో రూట్ (19), కొద్దిసేపటికి జానీ బెయిర్‌స్టో (12) ఔట్ అవ్వడంతో 87/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో మొయిన్ అలీ (21)తో కలిసి స్టోక్స్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కోలుకుంటున్న దశలో అలీ సహా క్రిస్ వోక్స్ (10) పెవిలియన్ చేరారు. రెండో సెషన్‌లో మార్క్ వుడ్ ఔట్ అనంతరం స్టోక్స్ బాదుడు షురూ అయింది. ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడమూ కలిసొచ్చింది.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతంటే?
– 6000 Test runs.
– 197 wickets.One of the greatest ever from England – Take a bow, Ben Stokes. pic.twitter.com/5xkA6cE65O
— Johns. (@CricCrazyJohns) July 7, 2023
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!