ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నికయ్యారు. ముగ్గురూ ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా.. ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు రాజ్యసభ అభ్యర్థులు.. రాజ్యసభకు టీడీపీ నుండి ఎంపికైన బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుండి ఎంపికైన ఆర్.కృష్ణయ్య.. ఈ రోజు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..
ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.. రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు ఇరువురు నేతలు.. అంతేకాదు.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదు.. వారి అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు.. తమ పదవులతో పాటు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని తిరిగి రెండోసారి ఎంపికచేశారు సీఎం జగన్. అలాగే బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, సుప్రీంకోర్టులో న్యాయవాది ఎస్,నిరంజన్‌రెడ్డిలకు జగన్…
చంద్రబాబు నన్ను బలిపశువును చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్ రావు.. ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్.. బీద మస్తాన్ రావుకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు… పెద్దల సభకు ముఖ్యమంత్రి జగన్ నన్ను పంపించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.. జాతీయ స్థాయిలో వెళ్లటం అరుదైన అవకాశంగా…